దేశం వదిలిన రామకోటయ్య
Published on: Fri Jun 1, 2012 10:28AM
నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తెలుగుదేశంపార్టీని వదిలేశారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఆయన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలువనున్నారు. వై.ఎస్. జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకం కొద్దీ తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రామకోటయ్య చెప్పారు. రామకోటయ్య వ్యవహారం టిడిపి అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఇంకా పార్టీపరంగా ఈయనపై చర్యలు తీసుకుంటారని అందరూ భావిస్తుంటే చంద్రబాబు నేరుగా రామకోతయ్యకు ఫోను చేశారు. తనను కలిశాక నిర్ణయం తీసుకోమని బాబు కోరారు. అయితే తాను దీన్ని లెక్కచేయనని చెబుతూ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారి నిర్ణయం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. పరోక్షంగా ఆయన బాబును నొప్పించకుండా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.


