TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సి.రామచంద్రయ్యకు కోర్టులో ఎదురుదెబ్బ

Published on: Thu Feb 9, 2012 9:41AM

కడప: దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్యకు బుధవారం కడప జిల్లా రాజంపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై విచారణలో ఉన్న కేసును ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివోను స్థానిక ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ కోర్టు తోసిపుచ్చింది. కడపలో ఓ పోలీసు అధికారిని దూషించిన కేసులో సి.రామచంద్రయ్యపై కేసును ఉపసంహరించుకుంటూ ఇటీవల ప్రభుత్వం జివో జారీ చేసింది. ఈ జివోను కోర్టు రద్దు చేసి కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో విచారణ నిమిత్తం సి.రామచంద్రయ్య నాలుగు రోజుల క్రితం రాజంపేట కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో 2006లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జెసిబితో అక్రమణలు తొలగిస్తుండగా ఓ భవనం కూలిపోయంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదానికి అధికారులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రామచంద్రయ్యతో పాటు మరో ఇరవై మంది అప్పటి ఏఎస్పీ లక్ష్మీరెడ్డిని దూషించారు. ప్రభుత్వాధికారిని దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని రామచంద్రయ్యతో సహా ఇరవయ్యొక్క మందిపై కేసు నమోదైంది.