గుత్తుల ఇండిపెండెంటా ?
Published on: Mon Apr 9, 2012 3:12PM
రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన రామచంద్రపురం నియోజకవర్గం నాయకుడు గుత్తుల సూర్యనారాయణబాబు రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. గతంలో మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తరహాలో బిసిలందరినీ సమైక్యపరిచి తాను అధికారంలోకి రావాలని ఆయన గట్టినిర్ణయం తీసుకున్నారని సమాచారం. అప్పట్లో చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయాడన్న సానుభూతి కూడా పిల్లికి ప్లస్ అయిందని భావిస్తున్న గుత్తుల తానూ అదేతరహాలో ప్రచారం కూడా ప్రారంభించారట. ఏమైనా బిసీల బలమైన వేదికపై గుత్తుల ఈసారైనా గెలుపొందుతారా? లేదా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికి గుత్తుల సూర్యనారాయణబాబు ఇండిపెండెంట్ పోటీ చేయటం ఖాయమని ఆయన మద్దతుదారులు పత్రికల ముందు గొంతు చించుకుంటున్నారు.


