గాంధీతో రామ్ కొత్త సినిమా..?
posted on: Dec 28, 2013 1:53PM

వరుస ఫ్లాపులతో ఉన్న హీరో రామ్ దర్శకుడు గాంధీకి ఓకే చెప్పినట్లు తెలిసింది. "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీతో రామ్ తన ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఇటీవలే గాంధీ చెప్పిన కథ నచ్చడంతో రామ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో గాంధీ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. మరి ఈ చిత్రమైన రామ్ కు విజయం అందిస్తుందో లేదో చూడాలి.







