ఆ "గే" పాత్రకు ఆయనే ప్రేరణంట...!
posted on: Nov 12, 2013 11:41AM

రామ్, వెంకటేష్ ప్రధాన పాత్రలలో కలిసి నటించిన తాజా చిత్రం "మసాలా". ఈ చిత్రం ఈ నెల 14వ తేదిన విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో హీరో రామ్ రెండు పాత్రలలో నటిస్తున్నాడు. ఒకటి మాములు యువకుడి పాత్రలో, రెండవది గే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ గే షేడ్స్ పాత్ర చేయడానికి తనకు ఒకరు ప్రేరణగా నిలిచారని రామ్ తెలిపాడు. ఇంతకీ ఆ వ్యక్తీ ఎవరా అని అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు. ప్రముఖ డాన్స్ డైరెక్టర్ శివ శంకర్ మాస్టర్.
ఈ విషయాల గురించి హీరో రామ్ మాట్లాడుతూ... "ఇందులో గే షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి నాకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓ పాట చిత్రీకరణ జరిగింది. ఆ పాటకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఆ సమయంలో ఆయనను గమనించాను. చివరకు ఆయననే ప్రేరణగా తీసుకుని, ఈ పాత్ర చేశాను అని అన్నాడు.
మరి రామ్ చేసిన ఈ పాత్రకు శివశంకర్ ప్రేరణ అవడానికి కారణం ఏమిటి? అంటే ఆయన ఏమైన అలాగే చేస్తాడని రామ్ అనుకున్నాడా? ఏంటో మరి..



.jpg)


