నిధి చాల సుఖమా.. రాముని సన్నిధి సేవ చాల సుఖమా..!
Published on: Thu Jun 23, 2022 7:08AM
అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశంలోని హిందువుల ఆకాంక్ష. ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, ఆందోళనలు, ఉద్యమాల తరువాత సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలో.. శ్రీరాముడి జన్మస్థలంలో రామమందిర నిర్మాణానికి అవకాశం, అనుమతి లభించింది.
దీంతో అక్కడ భవ్య రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల సేకరణ ప్రారంభించింది. నిథి సమర్పణ్ యోజన కింద విరాళాలను సేకరిస్తోంది. కుప్ప తెప్పలుగా విరాళాలు వచ్చి పడుతున్నాయి. అబ్బో దేశంలో రామ మందిర నిర్మాణం కోసం ఎందరు ఉదారంగా విరాళాలిస్తున్నారో.. దేశంలో ఆధ్యాత్మికత ఎంతగా పరిఢ విల్లుతోందో అని రామ భక్తులు సంబరపడిపోయారు.
కానీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో షాకింగ్ విషయం బయటపడింది. ఇప్పటికీ వరకూ సేకరించిన ఇప్పటి వరకూ సేకరించిన విరాళాలలో 22 వేల కోట్ల రూపాయల విలువైన 15,000 చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ విషయాన్ని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది. అయోధ్యలో రామమందిరం ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.3400 కోట్లు విరాళంగా అందాయి. ఇక బౌన్స్ అయిన 22 వేల కోట్ల రూపాయల విలువైన చెక్కుల విషయానికి వస్తే అవి బౌన్స అవ్వడానికి కారణాలేమిటన్నది మాత్రం విశ్వహిందూ పరిషత్ వెల్లడించలేదు.
చెక్కులు బౌన్స్ కావడానికి సంతకం సరిపోలక పోవడం, అక్షర దోషాలు వంటి చిన్న చిన్న కారణాలతో బౌన్సయిన చెక్కులు కూడా ఉన్నాయనీ, వాటిని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, అవి ఇచ్చిన వారి కన్సంట్ తో అవి క్లియర్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్ల బౌన్సయిన చెక్కులు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. వాటి విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. బౌన్సయిన చెక్కులలో అత్యధికం అయోధ్యలో నివసించే స్థానికులు ఇచ్చినవే అని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది. అయోధ్యలో నివసిస్తున్న దాతల చెక్కులు అత్యధిక సార్లు బౌన్స్ అయ్యాయని నివేదికలో పేర్కొంది. ఒక్క అయోధ్య జిల్లాలోనే రెండు వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి.


