ఏపీ బీజేపీకి కొత్త ఇన్ ఛార్జ్..

 

వచ్చే ఎన్నిక్లలో ఏపీ బీజేపీ పరిస్థితి ఏంటో ఎవ్వరిని అడిగినా చెబుతారు. ఇచ్చిన విభజన హామీలు నేరవేర్చకపోవడం... ప్రత్యేక హోదా విషయంలో, అలాగే బడ్జెట్ విషయంలో చిన్న చూపు చూడటం చూసి బీజేపీ అంటేనే మండిపడుతున్నారు ఏపీ ప్రజలు. దీని పర్యావసానం బీజేపీ తప్పదు చూస్తుంది. ఇప్పటికే తమ పరిస్థితి ఏంటో బీజేపీకి అర్దమైపోయి ఉంటది. అయితే ఏపీలోనూ సాధ్యమైనన్నీ ఎక్కువ సీట్లు సాధించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం నరేంద్రమోదీ, అమిత్ షా జోడి… ఆంధ్రప్రదేశ్ కు రామ్ మాధవ్ ను పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా నియమించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేత రామ్ మాధవ్. ఈయన జమ్మూ కాశ్మీర్, అసోంతో పాటు రీసెంట్ గా బీజేపీ విజయం సాధించి త్రిపురలో ఆ పార్టీ గెలుపు కోసం తనదైన వ్యూహాలను అమలు చేశారు. అందుకే రామ్ మాధవ్ ఎక్కడికి వెళితే… అక్కడ పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. అయితే తన సొంత రాష్టమైన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ప్రభావం చూపించలేకపోయిన రామ్ మాధవ్… తాజాగా ఏపీకి పరిశీలకుడిగా మారబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మోదీ షా జోడి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని… త్వరలోనే రామ్ మాధవ్ ఏపీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుంటారని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు.