కూతురు రేవతి నిశ్చితార్థంలో రామ్ గోపాల్ వర్మ
Published on: Fri Jan 4, 2013 2:32PM

రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి నిశ్చితార్థం హైదరాబాద్లోని రాడిస్సన్ హోటల్లో జరిగింది. ఈ వేడుకలో రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఎమ్ బీబీఎస్ చదువుతున్న రేవతి వర్మ తన సహచర విద్యార్ధి ప్రణవ్ ని వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయాలకు వ్యతిరేఖిగా మాట్లాడే వర్మ నిశ్చితార్థ కార్యక్రమంలో అసలైన తండ్రి రోల్ పోషించినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు రాజమౌళి తన ట్వీట్ తో తెలియజేశాడు. కూతురి నిశ్చితార్థంలో వర్మ పోషించిన రోల్ గురించి రాజమౌళి ఈ విషయమై ట్వీట్ చేస్తూ... "వర్మ తన కుమార్తె రిసెప్షన్ లో ఓ భాద్యత గల తండ్రిగా ఉండటం చాలా ఆనందం కలిగించింది... వాటే సైట్....హ..హ..హ" అన్నారు. ఇక ఈ పంక్షన్ కి హాజరైన వారు రాము చాలా ఆనందంగా ఈ పంక్షన్ లో పాల్గొన్నాడని, చాలా ఉత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ పంక్షన్ కి చాలా తక్కువ మంది పరిశ్రమలో వారిని ఇన్వైట్ చేసారు.


