TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వర్మ సినిమా పేరు ‘కేసీఆర్’.. సమంత, తమన్నాకంటే కేసీఆర్ అందగాడు: వర్మ

Published on: Fri Aug 15, 2014 9:30AM

 

నా తదుపరి సినిమా టైటిల్ కేసీఆర్ అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. కేసీఆర్ అనే పదం ఎన్ టీఆర్ అనే పదం కంటే వినడానికి బాగుందని వర్మ మరో ట్విట్ లో పేర్కొన్నారు. ఆధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్ ను అందగాడిని చేశాయి అన్నారు. ఇంకా ఒక అడుగు ముందేసి సమంత, తమన్నా, ఇలియానాలు కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందని వర్మ ట్వీట్ చేశారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్.. కాని కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ కూడా ట్వీట్ చేశారు.