TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంచు వారితో వర్మ ఒట్టు

Published on: Tue Dec 24, 2013 11:21AM

 

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "ఒట్టు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో విష్ణు మంచు నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా పూర్తి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.