TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీడియాకి రామ్ గోపాల్ వర్మ సారీ!

Published on: Tue Jul 15, 2014 4:47PM

 

మొన్నీమధ్య రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్‌లో ఒక పోస్టు పెట్టాడు. అది తన ‘ఐస్ క్రీమ్’ సినిమాకి వ్యతిరేకంగా రివ్యూ రాసిన వారిని కుక్కలతో పోలుస్తూ రాశారు. అయితే ఆ పోస్టు గురించి రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివరణ ఇచ్చారు. దాంట్లో తాను కుక్కతో పోల్చింది రివ్యూలు చేసే అందరి గురించి కాదనీ, ఒకానొక వెబ్ సైట్‌లో రివ్యూ రాసిన ఒకానొక వ్యక్తి గురించి అని వివరించాడు. వేరే ఎవరైనా ఈ విషయంలో హర్ట్ అయి వుంటే వారికి సారీ చెప్పాడు. ఆ మాట ఆయన మాటల్లోనే.. ‘‘నేను రివ్యూవర్ల గురించి రాసిన ప్రెస్ నోట్‌లో నేను ఉద్దేశించింది కేవలం ఆ పేరు, మొహం కూడా దాచుకొని తిరిగే ఆ పిరికి (వెబ్ సైట్ పేరు) మనుషుల్లా౦టోళ్ళ గురించి... అంతే కానీ కామన్ గా రివ్యూవర్లందరిని, ఇంకా వేరే మీడియావాళ్ళని కలిపి ఉద్దేశించింది కాదు.. ఒకవేళ ఆ మూడ్‌లో, తొందరలో నేను రాసిన దాంట్లో అలా వచ్చుంటే దానికి నా క్షమాపణలు. బొంబాయిలోనూ, హైదరాబాద్‌లోనూ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎక్కువగా మీడియా వాళ్లు, రివ్యూవర్స్ ఉన్నారు. అలాంటప్పుడు నేను ఉద్దేశ్యపూర్వకంగా అలాఅనటం అనేది జరగదు’’ అని రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చాడు. పర్లేదు.. వర్మకి ఈ కర్టసీ కూడా వుంది.