TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వర్మ బయోపిక్ తీశాడా? భయపడుతూ పిక్చర్ తీశాడా? 

Published on: Fri Dec 23, 2016 1:09PM

 

విజయవాడు పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు గుర్తొచ్చేది దుర్గమ్మ. ఆ దుర్గమ్మ పాదాల చెంత వున్న కృష్ణమ్మ. అదే విజయవాడలో పుట్టిన మన వర్మ.... మరో విజయవాడ ఐకాన్ వంగవీటి జీవితచరిత్ర తీసుకుని సినిమా తీశాడు. కాని, తీరా జనం థియేటర్స్ కి వెళ్లి కళ్లప్పగించి చూస్తే మాత్రం... ఆశలన్నీ దుర్గమ్మ పాదాల వద్ద వున్న కృష్ణమ్మలో కలిపేశాడంటున్నారు! ఎందుకంటే, వంగవీటి సినిమా దుర్గమ్మ సమక్షంలోనే ఎండై అందర్నీ ఉసూరుమనిపిస్తోందట!

వంగవీటి, దేవీనేని... ఈ రెండు పదాలు విజయవాడతో ఏ కాస్త పరిచయం వున్న వారికైనా బోలెడు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అసలు బెజవాడ గురించి ఏమీ తెలియని వారికి కూడా కాపు కాసే శక్తి అంటూ వర్మ బయలుదేరేసరికి ఛచ్ఛేంత ఇంట్రస్ట్ పుట్టుకొచ్చింది. కాని, తీరా తెరపై రామూ ఫస్ట్ ఎవర్ బయో పిక్ చూశాక చావులు తప్ప ఏం లేవని తేలిపోయింది. ఇంట్రవల్ కి ముందు , తరువాత వరుస మర్డర్లు తప్ప మ్యాటర్ లేదంటున్నారు హార్ట్ కోర్ ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా. ఇక మామూలోళ్ల సంగతైతే చెప్పక్కర్లేదు. కనీసం రంగ హత్యకి ఎవరు కారణం అన్నది కూడా హింట్ ఇవ్వకుండా ఎండ్ చేశాడట వర్మ. మరో వైపు వంగవీటి అన్న పేరు పెట్టి దేవినేని ఫ్యామిలీని హైలైట్ చేశాడని కూడా అంటున్నారు, కొందరు పొలిటికల్ సెన్స్ వున్నవాళ్లు! 

ఎవరు ఏమన్నా... వర్మ వదిలిన వంగవీటి ఇప్పుడు థియేటర్స్ లో వుంది. తన కెరీర్లో మొదటి సారి బయపిక్ కు తెగబడ్డ ఆయన భయపడుతూ పిక్చర్ నడిపాడని ఘాటు విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి మరి...