వర్మ ని చెప్పులతో కొడతాం...
Published on: Thu Mar 9, 2017 4:32PM
.jpg)
మహిళా దినోత్సవం సందర్భంగా రాంగోపాల్ వర్మ శుభాకాంక్షలు చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచలోని మహిళలంతా పురుషులకు సన్నీలియోన్ కలిగించేంత సంతోషం కలిగించాలని కోరుకుంటున్నా అంటూ వర్మ ట్వీట్స్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ నేత విద్యా చవాన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై వర్మ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని.. లేకపోతే చెప్పులతో కొడతామని హెచ్చరించారు. మరోవైపు మరోవైపు చిత్ర పరిశ్రమ నుంచి కూడా వర్మపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫిల్మ్ స్టూడియో సెట్టింగ్ అనుబంధ మజ్దూర్ యూనియన్ సైతం ఆయన సినిమాలను బహిష్కరించాలని సభ్యులకు పిలుపునిచ్చింది. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.


