TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా దినోత్సవాన్ని కూడా వదలని వర్మ...

Published on: Wed Mar 8, 2017 11:24AM


ఆఖరికి రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవాన్ని కూడా వదలకుండా తనదైన శైలిలో ట్విట్టర్లో ట్వీట్స్ చేశాడు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా దీనిపై స్పందించిన వర్మ..

 
‘‘ఏడాదిలో అన్నీ రోజులు పురుషులవేనని.. ఈ ఒక్కరోజు మహిళకు ఇచ్చారు. ఉమెన్స్‌ డే’ని ‘మెన్స్‌ డే’ అనాలి. మహిళలను పురుషులు సంతోష పెట్టినంతగా.. పురుషులను మహిళలు సంతోషపెట్టలేరు. కనీసం పురుషుల దినోత్సవం రోజైనా మహిళలు వారిపై అరుపులు, కేకలు వేయకూడదు. వారికి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. పురుషుల అందరి తరఫు నుంచి నేను మహిళలకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆ రోజు పురుషులు మహిళలకు ఏం చేయాలో నాకు తెలియదు.. కానీ ఏడాదిలో ఒక రోజు మాత్రం పురుషులు మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.’’అని  అన్నారు. అక్కడితో ఆగకుండా.. "ప్రపంచంలోని ఆడవాళ్లంతా, మగవారికి సన్నీలియాన్ ఇచ్చినటువంటి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు. పురుషులందరి తరఫునా మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నానని, ఏదో ఒకరోజు పురుషులకూ స్వాతంత్ర్యం లభిస్తుందని, 'మెన్స్ డే' జరుపుకునే రోజు వస్తుందని అన్నాడు.