Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాందేవ్ బాబా కు ప్రమాదం.. అంతా ఉత్తిదే..!
posted on: Apr 25, 2017 6:28PM

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కు ప్రమాదం జరిగిందా..? ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ వందతులు మాత్రం షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఆయన ఓ రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడ్డారని.. ఆయనను స్ట్రెచర్ మీద ఆసుపత్రికి తరలిస్తున్నట్టు పలు ఫొటోలు ఫేస్‌బుక్, వాట్సప్‌లలో షేర్ అవుతున్నాయి. అయితే ఈ కథనాలపై స్పందించిన ఆయన సన్నిహితులు ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం రాందేవ్ బాబా హరిద్వార్‌లో నిక్షేపంగా ఉన్నారని..ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు సృష్టించారని చెప్పారు. ఇక రాందేవ్ బాబా కూడా దీనిపై స్పందించి... తాను క్షేమంగా ఉన్నానంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.






