మెగా ఫ్యామిలీ వార్: పవన్ వర్సెస్ చరణ్
Published on: Wed Mar 26, 2014 3:39PM
.jpg)
మెగా ఫ్యామిలీ లో విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. బాబాయితో అబ్బాయి 'ఢీ' కొనడానికి సిద్దమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపు పవన్ కళ్యాణ్ వైజాగులో తన జనసేన పార్టీ మొట్టమొదటి సమావేశం నిర్వహించబోతుండటంతో, అదే రోజు రామ్ చరణ్ తేజ్ తన పుట్టిన రోజును గ్రాండ్ గా చేసుకోవడానికి హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో మెగాభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు. వీరికి అక్కడే భోజన ఏర్పాట్లు కూడా చేయడం చూస్తే..రేపు విశాఖలో జరిగే పవన్ సభకు మెగా అభిమానులను వెళ్ళకుండా అడ్డుకోనేందుకే అబ్బాయి ఈ ప్లాన్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రేపు సాయంత్రమే బాబాయ్ పవన్ కళ్యాణ్ తన మొదటి రాజకీయ సభను నిర్వహిస్తున్నారని తెలిసి కూడా రామ్ చరణ్ కూడా సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా హైదరాబాదులో మరో సమావేశం నిర్వహించడంతో అభిమానులు బాబాయ్-అబ్బాయ్ లలో ఎవరినో ఒకరిని ఎంచుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. మరి మెగా అభిమానులు ఎవరికీ జై కొడతారో వేచి చూడాలి!


