TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ్ చరణ్ పెళ్ళికి హాజరుకానున్న రాహుల్, సోనియాగాంధీ

Published on: Thu Jun 7, 2012 10:46AM

జూన్ 14న జరిగే రామ్ చరణ్, ఉపాసనల పెళ్ళికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్నారని సమాచారం. రామ్ చరణ్, ఉపాసనల పెళ్ళి మొయినాబాద్ లోని ఉపాసనల ఫార్మ్ హౌస్ లో జరగను౦ది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి సందడీ మొదలైంది. ఇప్పటికే పెళ్ళికి రానున్న అతిథులందరినీ ఆహ్వానించారు. కామినేని, మెగా మ్యారేజ్ కు అన్ని ఏర్పాట్లు తొందరగా సాగుతున్నాయి. రామ్ చరణ్ పెళ్ళికి పదిహేను రోజుల ముందుగానే తన సినిమాల షూటింగ్ కి సెలవు తీసుకున్నారు. తన హనీమూన్ అయ్యేంత వరుకు రామ్ చరణ్ సినిమాలకు దూరంగా ఉండనున్నారు. ఉపాసన తాజాగా కరీంనగర్ జిల్లా వేములవాడలోని రాజన్న దర్శనం చేసుకున్నారు. పెళ్ళికి ముందు రాజన్న దర్శనం చేసుకోవటం కామినేని ఫ్యామిలీ ఆచారం. అత్యంత వైభవంగా జరగనున్న రామ్ చరణ్, ఉపాసన పెళ్ళికి దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.