TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ్ చరణ్ 'తుఫాన్' సినిమాను అడ్డుకుంటా౦

Published on: Thu Sep 5, 2013 10:41AM

 

Ram Charan Toofan, Ram Charan Toofan release, Ram Charan Toofan movie

 

 

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్, బాలివుడ్ భామ ప్రియాంకా చోప్రా నటించిన తుఫాన్ సినిమా ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు సినీ నిర్మాతలు రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ వారు ప్రకటించారు. ఒక పక్క ఉద్యమాలు భయపెడుతున్నపటికీ దైర్యం చేసి సినిమాను విడుదల చేయబోతుంటే వారు భయపడినట్లే ఈ రోజు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సమైక్యవాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను కాల్చివేసి, చిరంజీవి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనంత వరకూ ఆ కుటుంబానికి చెందిన హీరోల సినిమాల విడుదలకు అంగీకరించబోమని, ఒకవేళ కాదని విడుదలచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.


నిజామబాద్ జిల్లాలో కూడా అటువంటి ఘటనే జరిగింది. అక్కడ తెలంగాణా వాదులు తుఫాన్ సినిమా పోస్టర్లను చింపి తగులబెట్టారు. తెలంగాణా ప్రజల ఆదరణతో, సొమ్ముతో ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవి, అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడటం తాము సహించబోమని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని కుటుంబానికి చెందిన హీరోలెవరి సినిమాలను తెలంగాణాలో ఆడనీయబోమని వారు హెచ్చరించారు.