TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రికార్డ్ రిలీజ్ పై కన్నేసిన రామ్ చరణ్ 'నాయక్'

Published on: Thu Jan 3, 2013 9:41AM

 

ram charan nayak, ram charan nayak release, recrod release for nayak, ram charan nayak movie

 

 

నాయక్ సంక్రాంతికి హంగామా చేయనున్నాడు. రామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న తొలి మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ పై టాలీవుడ్ లో హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి ఈ సినిమాలో కొన్ని మార్పులు చేశారని వార్తలు రావడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ప్రాంతాల వారిగా అమ్ముడుపోయిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఎక్కువ ధియేటర్ లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.



ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం హైదరాబాద్లో వంద ధియేటర్లో, నైజాం లో మూడువందల పైగా ధియేటర్లో విడుదల చేయటానికి నిర్ణయించారు. వైజాగ్ ఏరియాల్లో వందకు పైగా ధియేటర్లో రిలీజ్ చేయనున్నారు. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.