రామ్ చరణ్ పెళ్లికి హాజరుకానున్న చిదంబరం
Published on: Wed Jun 13, 2012 3:50PM
రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ చరణ్, ఉపాసనల వివాహానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం హైదరాబాద్ కు రానున్నారు. చిదంబరం బుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. గురువారం చరణ్ వివాహానికి హాజరవుతారు. గురువారం ఉదయం ఏడున్నరకు కొణిదెల చిన్నోడు కామినేని రాకుమారి మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. పెళ్లి కోసం హిమాయత్‌సాగర్‌లోని అపోలో వారి ఫామ్‌హౌజ్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ సెట్టింగ్స్‌తో, కలర్‌ఫుల్ లైటింగ్‌తో వివాహవేదిక వాహ్‌వా అనిపిస్తోంది. డెకరేషన్ కోసం విదేశాల నుంచి కాస్ట్‌లీ ఫ్లవర్స్ తెప్పిస్తున్నారు. ఉదయం ఫామ్‌హౌజ్‌లో పెళ్లివేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో చిరంజీవి మ్యారేజ్ రిసెప్షన్ ఇస్తున్నారు. జూన్ 15న ఫ్యాన్స్‌కు సెపరేట్‌గా విందు ఏర్పాటు చేశారు.


