TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామేశ్వరంలో చెర్రీ షూటింగ్

Published on: Wed Feb 19, 2014 8:53AM

 

కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతోంది. చరణ్ కు బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. చరణ్ సరసన కాజల్ నటిస్తుంది. తమిళ నటుడు రాజ్ కిరణ్ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపిన చిత్రమిది. ఇందులో చరణ్ కొత్తగా కనిపిస్తాడు. త్వరలోనే నాగర్ కోయిల్, పొల్లాచ్చిలోనూ షూటింగ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు.