TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ్ చరణ్ ను పక్కన పెట్టేశారు..!

Published on: Mon Jul 22, 2013 3:18PM

 

ram charan koratala shiva movie, koratala shiva ram charan

 

 

'ఇద్దరమ్మాయిలతో' సినిమా విడుదల రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా ఓపెనింగ్ జరిపి ఇండస్ట్రీలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. కాని ఇదంతా 'ఇద్దరమ్మాయిలతో' వచ్చే కష్టాలను తప్పించుకోవడానికి గణేష్ వేసిన ప్లాన్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

 

'ఇద్దరమ్మాయిలతో' ముందుగానే భారీ రేట్లకు అమ్మిన గణేష్.. ఈ సినిమా తేడా కొడుతుందని ఉహించి బయ్యర్ల నుంచి  తప్పించుకోవడానికి రామ్ చరణ్ తో సినిమాని ఓపెనింగ్ చేసి హడావుడి సృష్టించారని తెలుస్తోంది. అసలు రామ్ చరణ్ తో కొరటాల శివ మూవీ కి స్టోరీ ఇంకా రెడీ కాలేదని సమాచారం.  లేటెస్ట్ గా కొరటాల శివ మహేష్‌కి ఓ కథ వినిపించారని తెలుస్తోంది. ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చడంతో..శివ ఇప్పుడు ఈ స్టోరీ మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాడట. ఈ మ్యాటర్ ను గణేష్ తన స్నేహితుల వద్ద లీక్ చేశారని సమాచారం.