TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రామ్ చరణ్ దంపతులు

Published on: Sat Oct 11, 2025 8:05PM

 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ప్రధాని మోదీని కలిశారు. అనిల్‌ కామినేని సారథ్యంలో వరల్డ్‌ ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్న వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన వివరాలను ఉపాసనతో కలిసి ప్రధానికి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా  శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును ప్రధానికి అందించారు. 

దీనికి సంబంధించి ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీగ్ విజయ వంతం అయిన సందర్బంగా మోదీని కలిసినట్లు చరణ్ తెలిపారు. మరోవైపు  రామ్‌చరణ్‌  బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీలో నటిస్తున్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.