నేను ఎన్టీఆర్ కు అడ్డు కాదు
Published on: Sat Dec 28, 2013 10:37AM

"కందిరీగ" చిత్రానికి తనకు రావాల్సిన పారితోషకాన్ని పూర్తిగా చెల్లించని కారణంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ పై రామ్ కేసు వేయనున్నాడని, అదే విధంగా ప్రస్తుతం సురేష్ నిర్మిస్తున్న "రభస" చిత్రానికి అడ్డుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రామ్ స్పందిస్తూ... ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అసలు నేను ఎందుకు "రభస" చిత్రానికి అడ్డు పడతాను అంటూ రామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.


