Latest News
డోకొచ్చేట్టున్న రాఖీ సావంత్!
posted on: Jun 12, 2014 1:25PM
.jpg)
బాలీవుడ్ నటి, టీవీ ప్రెజెంటర్ రాఖీ సావంత్‌ని, ఆమె వ్యవహారశైలిని చూసి చాలామంది ముఖాలు చిట్లిస్తారు. ఆమె నోరు తెరిచి మాట్లాడిందంటే చాలు.. ఎలాంటి వారైనా వినలేక చెవులు మూసుకుంటారు. జనంలో అంత మంచి ఇమేజ్ సంపాదించుకున్న రాఖీ సావంత్ ఈమధ్య జనాన్ని భయపట్టడం మాత్రమే కాకుండా ఏకంగా డోకు తెప్పించేంత పని చేసింది. ఓ మరాఠీ చిత్రాన్ని నిర్మిస్తూ, నటిస్తున్న రాఖీ సావంత్ ఆ సినిమాకి సంబంధించిన మీడియా మీట్‌కి ఘోరంగా మేకప్ చేయించుకుని వచ్చింది. రాఖీ సావంత్‌ని ఆమేకప్‌లో చూసిన వాళ్ళందరూ కడుపులో తిప్పినంత పనయి డోక్కోబోయి తమాయించుకున్నారట. ఇంతకీ రాఖీసావంత్‌ని సదరు మేకప్‌లో చూస్తే డోకు వస్తుందో లేదో స్వయంగా తెలుసుకోవాలంటే ఈ ఫొటోని ఒక్కసారి పరీక్షగా చూడాలిమరి.






