అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటా చిరు
Published on: Mon Mar 19, 2012 12:44PM
హైద
రాబాద్: తనకు రాజ్యసభ సీటు దక్కడం దైవ నిర్ణయమని తిరుపతి శానసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి అన్నారు. అధిష్టానం ఎలా చెబితే తాను అలా నడుచుకుంటానని ఆయన సోమవారం చెప్పారు. హైకమాండ్ నిర్ణయం మేరకు తన భవిష్యత్ ఆధారపడి వుంటుందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిరంజీవి రాజ్యసభ అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తనను ఖరారు చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పారు. రాజ్యసభ సీటు దక్కించుకున్న చిరంజీవి తన వర్గీయులకు అల్పహార విందు ఇచ్చారు. మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. మరో నేత వంగా గీత మాట్లాడుతూ చిరంజీవి రాజ్యసభకు వెళితే ఖాళీ అయ్యే తిరుపతి స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని వంగా గీత ధీమా వ్యక్తం చేశారు. చిరు రాష్ట్ర స్థాయి నుండి జాతీయస్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. పదవి రాని వారు ఎలాంటి అసంతృప్తి చెందవద్దని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు.


