రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
Published on: Tue Feb 21, 2012 3:36PM
న్యూ
ఢిల్లీ: తాను అధిష్టానాన్ని రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీ వచ్చానని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ నేత వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెసు ఇప్పటి వరకు ఎవరినీ వాడుకొని వదిలేయలేదన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు ప్రధాన శత్రువు అని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ప్రధాన శత్రువులు తెలుగుదేశం, జగన్ పార్టీలేనని ఆయన స్పష్టం చేశారు. తాము జగన్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. జగన్‌తో సహా అవినీతి ఆరోపణలు వచ్చిన వారు ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందేనని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ చేస్తున్న ప్రచారం తప్పన్నారు.


