రాజ్యసభకు వైఎస్ వివేక?
Published on: Wed Feb 15, 2012 2:21PM
హైదరాబా
ద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి రాజ్యసభ సీటుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఢిల్లీలో పార్టీ అధినేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలియవచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకోసం తాను వైఎస్ కుటుంబంనుంచి బైటకు వచ్చానని, దైర్యంగా జగన్ ను ఎదిరించానని, తాను పడిన కష్టానికి ఫలితంగా రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. జిల్లాలనుంచి తనను రాజ్యసభకు పంపినట్లయితే పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా అవకాశం ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలిసింది. వై.ఎస్.వివేకానందరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి సంశయిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటే జగన్, వైఎస్ కుటుంబంలోని మిగిలిన సభ్యుల తాకిడికి తాను తట్టుకోలేనని ఆయన భయపడుతున్నట్లు తెలిసింది.


