TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మా ఆశ... అభిమానుల కోరిక...

Published on: Sat Aug 25, 2012 9:02AM

కొందరు అభిమానులు నన్ను సిఎంగా చూడాలను కుంటున్నారు. అది వాళ్ళ అభిమానంగానే చూడాలి తప్ప వేరుగా అర్ధం చేసుకోకూడదు. ప్రజల్లో నాపై ఉన్న అభిమానం తోనే అలా కోరుకుంటున్నారు. ప్రత్యేకించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా అభిమానులు అలా కోరుకోవడాన్ని తప్పుగా చూడకూడదు’ అని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన 57వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు తనను అభిమానించే ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోయేలా సుస్థిర స్థానాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం తనకు ఉంటాయని, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ప్రతిభ ఉండాలేకాని సినీరంగంలో ఎంతమంది కొత్తవారికైనా అవకాశాలు ఉంటాయని చెప్పారు. అలాగే ఉద్దండులైన ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు అప్పటికే సినీరంగంలో ఉన్నా కొత్తగా వచ్చిన తనలాంటి వారిని కూడా ప్రజలు చక్కగా ఆదరించారని చిరంజీవి తెలిపారు. ‘నేను కొత్తగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినా, కొద్దిరోజుల్లోనే ప్రజల అభిమానం పొందగలిగాను. ఇంకా కృషి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో తప్పకుండా స్థానం దక్కుతుంది.’ అన్నారు. తన 150వ సినిమా గురించి చెబుతూ.. మంచి కథ నచ్చితే తప్పకుండా చేస్తానన్నారు. అయినా నేను 150వ సినిమా గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైతే రాజకీయాల్లో బిజీగా ఉన్నానని అన్నారు. నిజమే ఏ హీరో అభిమానులైనా తమ హీరో ఎన్నో అద్భుతాలు చేయాలని, తాము ఆశించే, ఎవరికి అందనంత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. అది అభిమానుల నిస్వార్ధమైన అభిమానానికి నిదర్శనం. అభిమానుల కోరిక మేరకే ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి కొంతకాలం అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అందుకుప్రతిగా ఉన్నతపదవిలో ఉన్న చిరంజీవి తన రాజకీయ ఎదుగుదలకు మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఈ కృషిలో భాగంగానే, కోస్తాజిల్లాలకు చెందిన ఓ పెద్దమనిషి తన అభిమాన నాయకుడిని ఎలాగైనా సిఎం. చేయాలంటూ కంకణం కట్టేసుకుని ఏకంగా ఓ టీవీ ఛానల్‌ పెట్టేసే సన్నాహాల్లో ఉన్నాట్ట...!