వైకాపా, టీఆర్ఎస్ ల రాజకీయ మైత్రి

 

 

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రహస్య ఒప్పందాలు నడుస్తున్నాయని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వారిద్దరి రాజకీయ మైత్రికి రాజ్యసభ ఎన్నిక వేదిక కానుంది. శాసనసభ బలాబలాలను చూస్తే.. రాష్ట్రంలో ఉన్న ఆరు ఖాళీలకు మూడు కాంగ్రెస్‌కు, రెండు టిడిపికి దక్కడం ఖాయం. మిగిలిన ఒక స్థానం కోసం వైకాపా, టీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్ధిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. దీనిపై రెండు పార్టీల మధ్య రహస్య మంతనాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


రాజకీయవర్గాలలో వినిపిస్తున్నా గుసగుసల ప్రకారం... నెల్లూరు జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త ప్రభాకర్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దాని కోసం ఆయన భారీగానే ముట్టజెప్పినట్లు సమాచారం. ఇటీవల జగన్ తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ డీల్ కుదిరినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.  మొదట జగన్ ప్రభాకర్‌రెడ్డికి.. ఒంగోలు లేదా నెల్లూరు అసెంబ్లీ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట..కాని ఈసారి రాజ్యసభ ఎన్నికల్లోనే అవకాశం ఇప్పించాలని ఆయన పట్టుపట్టారు. దానికి ఎంత ఖర్చయినా సిద్ధమేనన్నారట. టీఆర్‌ఎస్‌తో కూడా మాట్లాడి ఎలాగైనా తనకే సీటు వచ్చేలా ఒత్తిడి తెచ్చారట. దానితో రంగంలోకి దీగిన జగన్..టీఆర్‌ఎస్ అగ్రనేతతో రహస్య మంతనాలు జరిపి ఒప్పించినట్లు చెబుతున్నారు.

ఇప్పటి పరిస్థితి ప్రకారం ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే..39 ఓట్లు కావాలి. వైకాపా, టీఆర్ఎస్ కలిస్తే అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చెలా ఉన్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్ ‘దిక్కరించి, కాంగ్రెస్ అభ్యర్ధికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఓట్లు వేసినా వారిపై కేసీఆర్ ఎలాంటి చర్య తీసుకోని విషయం తెలిసిందే. ఇప్పడు అదే పద్దతిని ఇక్కడ కూడా ఫాలో అవ్వలని నిర్ణయించినట్లు సమాచారం!!