TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

Published on: Wed Mar 4, 2026 9:14PM

 

తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి అవకాశం కల్పించగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రేపు వారిద్దరూ అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొననున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం దృష్ట్యా వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉంది. సీఎం  రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఎంపికతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.