TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కొవిడ్.. 

Published on: Mon Jan 10, 2022 3:53PM

దేశంలో కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కొవిడ్ తీవ్రతను బట్టి దేశంలో థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ఢిల్లీలో పాజిటివిటి రేటు దాదాపు 15 శాతానికి దగ్గరలో ఉంది. రాజధానిలో సెలబ్రెటీలు వైరస్ భారీన పడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కరోనా సోకింది.

తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కొవిడ్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని, కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ ఐసోలేషన్ లో ఉండాలని, తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

దేశ పార్లమెంట్ లోనూ కొవిడి కలకలం రేపింది. పార్లమెంట్ సిబ్బందికి టెస్టులు చేయగా 402 మందికి వైరస్ నిర్దారణ అయింది. మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో కేసుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. కొవిడ్ విజృంభణతో ఢిల్లీ సర్కార్ మరిన్ని కఠిన చర్యలకు దిగుతోంది. ఇప్పటికే స్కూల్స్ క్లోజ్ చేయగా.. రెస్టారెంట్లు మూసివేయాలని నిర్ణయించింది.