TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

Published on: Wed May 7, 2025 7:08PM

 

దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భద్రతకు భంగం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించమని ఆయన అన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమాయకులను చంపిన వారినే మేము హతం చేశామని అన్నారు. పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులపై భారత సైన్యం తమ సత్తా ఏంటో చూపించింది. పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం చేయలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుత్రువులకు తగిన విధంగా బుద్ది చెప్పామని వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని తెలిపారు. 

ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను హతం చేయడం చాలా రిస్క్ తో కూడిన విషయం అని.. భారత సైన్యం రిస్క్ అయినప్పటికీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాలని భావించి దాడి చేసినట్టు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను హతం చేయడం చాలా రిస్క్ తో కూడిన విషయం అని.. భారత సైన్యం రిస్క్ అయినప్పటికీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాలని భావించి దాడి చేసినట్టు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధుర్‌లో హనుమంతుడి లంకా దహనాన్నే ఆదర్మంగా తీసుకున్నమని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందన్నారు. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.