రాజకీయాల్లోకి తలైవా

గత కొంతకాలంగా వస్తొన్న ఊహాగానాలకు.. విమర్శలకు చెక్ పెట్టారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత కొద్ది రోజులుగా తన అభిమానులతో సమావేశమవుతున్న ఆయన ఇవాళ జరిగిన చర్చల్లో రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యారు. అనంతరం తన నిర్ణయాన్ని మీడియా సాక్షిగా తమిళ ప్రజలకు తెలిపారు తలైవా.. దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని.. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. డబ్బు, పదవి మీద ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. రజనీ ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు రోడ్డు మీదకు వచ్చి టపాసులు కాలుస్తూ.. స్వీట్లు పంచుతూ కేరింతలు కొడుతున్నారు.