TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆస్పత్రిలో రజనీకాంత్.. గుండె సమస్యలు!

Published on: Tue Oct 1, 2024 6:30AM

తమిళ సినీ కథానాయకుడు రజనీకాంత్‌ గుండెకు సంబంధించిన సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెకు సంబంధించిన పలు ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన వున్న నేపథ్యంలో ఆయన చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే వుందని డాక్టర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే, రజనీకాంత్ ఆస్పత్రిలో చేరిన విషయంలో ఆస్పత్రి వర్గాల నుంచిగానీ, రజనీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రజనీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా అక్టోబర్ 10న విడుదలవుతోంది. కూలీ అనే సినిమా సెట్స్ మీద వుంది.