శృతి మించిన రజనీ అభిమానులు
Published on: Thu Dec 19, 2013 9:16AM

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే అందరికి అభిమానమే. ఇటీవలే రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు అభిమానులు. తమిళనాడు, చెన్నయ్ లలోమరింత సందడిగా జరిగాయి. కానీ ఒకే ఒక పోస్టర్ వివాదానికి దారి తీసింది. ఈ పోస్టర్ లో రజినీకాంత్ ఓటు వేయడానికి క్యూలో నిలబడిన పోస్టర్ అది. అంతే కాకుండా ఈ పోస్టర్ లో రజనీ వెనకాల వినాయకుడు, విష్ణుమూర్తి నిలబడినట్లుగా ముద్రించారు. పైగా "తలైవా..! నువ్వు కనుక రాజకీయాల్లోకి వస్తే దేవుళ్ళు కూడా ఓటేస్తారు" అంటూ రాశారు. దీంతో విశ్వ హిందూ పరిషత్ వారికీ ఆగ్రహాన్ని కలిగించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని వారు మండిపడుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి కూడా తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నారట. పాపం రజనికాంత్.. అభిమానం మరీ ఈ రేంజ్ లో ఉంటే, ఆయన మాత్రం ఏం చేయగలడు చెప్పండి.


