TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కింగ్‌ మేకరే.. కింగ్‌ కాలేడు

Published on: Sat Jan 6, 2018 10:17AM

 

అభిమానులను ఊరించి.. ఊరించి ఫైనల్లీ తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తలైవా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో.. ఒక్కసారిగా తమిళనాట మాత్రమే కాదు.. జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు... ర‌జ‌నీ పార్టీ పేరేంటి ? ఆయ‌న పార్టీ ప్ర‌భావం త‌మిళ‌నాడులో ఎంత వ‌ర‌కు ఉంటుంది ? ఆయన ఒంటరిగా బరిలో దిగుతారా...? లేక పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతారా...? ఎక్క‌డిక‌క్క‌డ హాట్ హాట్‌గా పొలిటిక‌ల్ డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. ఇక ఎవరి చర్చల్లో వారుంటే.. జ్యోతిష్యులు కూడా వారి పనిలో వారున్నారు.

 

రాజకీయాల్లో జ్యోతిష్యాలు చూడటం.. జోస్యాలు చెప్పడం కామనే. దీనిలో భాగంగానే... కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రకాష్‌ అమ్మునై అప్పుడే రజనీగారి జోస్యం చెప్పారు. రజనీ జాతకాన్ని పరిశీలించిన ప్రకాష్‌.. తలైవాకి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఏ మాత్రం లేదని తేల్చేశారు.  ‘‘రజనీకాంత్‌ ప్రజలను ఆకర్షించే సత్తా ఉన్న వ్యక్తి...మకర రాశి, సింహ లగ్నంలో జన్మించిన రజనీకాంత్‌కు రాజకీయాల్లో అడ్డు ఉండబోదని.. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఖచ్ఛితంగా రాణించగలరు అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవటం ఖాయం... కానీ, ముఖ్యమంత్రి పదవిపై మాత్రం ఆయన ఆశలు పెట్టుకోకపోవటమే మంచింది. ఆయన కింగ్‌ మేకర్‌ అవుతారే తప్ప.. కింగ్‌ కాలేరు’’ అని తేల్చిచెప్పేశాడు. అంతేకాదు.. సొంతవాళ్లే వెన్నుపోటే ప్రమాదం పొంచి ఉందని.. కాబట్టి రజనీ రాజకీయాలపరంగా ఎవరినీ నమ్మకపోవటమే మంచిదని ఆయన సూచిస్తున్నారు.

 

మరి ఇక్కడ ఏపీలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా సీఎం యోగం లేదని జ్యోతిష్యుడు వేణుస్వామి జోస్యం చెప్పారు. ఇక్కడ తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకి కూడా సీఎం యోగం లేదని ప్రకాష్‌ అమ్మునై జోస్యం చెప్పారు. మరి ముందు ముందు రాజకీయాలు ఎలా మారుతాయి.. వీళ్లకు నిజంగానే సీఎం అయ్యే యోగం ఉందో..? లేదో..? వీళ్ల జోస్యం నిజమవుతుందో..? లేదో..? తెలియాలంటే మనం కూడా వెయిట్ చేయాల్సిందే.