నా వెనుక బీజేపీ లేదు...

 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజులుగా హిమాలయాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన పర్యటన ముగిసింది.  హిమాలయాల పర్యటన ముగించుకుని ఈరోజు చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగిందని, తనకు కొత్త శక్తి నిచ్చిందని అన్నారు. అంతేకాదు రజనీ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ వెనుక బీజేపీ ఉందన్న వార్తలను ఆయన ఖండించారు. నా వెనుక బీజేపీ ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.. ఆ వ్యాఖ్యలు తప్పని, తన వెనుక ఉన్నది ‘దేవుడు’ అని రజనీ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి మీడియా ఎన్ని ప్రశ్నలు వేసినా తాను చెప్పే సమాధానమిదేనని అన్నారు.