రజనీకి బర్త్ డే విషెస్...చంద్రబాబు, మోహన్ బాబు..

 

నేడు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు  కావడంతో పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆదర్శనటుడికి పుట్టిన రోజు అభినందనలని, ఆయన్ను విజయం వరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

 


ఇంకా రజనీ మిత్రుడైన మోహన్ బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. 'హ్యాపీ బర్త్ డే టు మై డియర్ ఫ్రెండ్ రజినీ. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు.