నేను ఎవరికి మద్దతు ఇవ్వడంలేదు.. తేల్చేసిన రజనీ...
Published on: Thu Mar 23, 2017 11:14AM
.jpg)
ఆర్కే నగర్ ఉపఎన్నికల నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. బీజేపీ అభ్యర్థి అమరన్, రజనీ భేటీ అయిన నేపథ్యంలో రజనీ రాజకీయ ఎంట్రీపై పలు వార్తలు షికార్లు చేశాయి. రజనీ.. అమరన్‌ను కలిసినట్లు అతని కుమారుడు వెంకట్ ప్రభు ట్వీట్ చేయడంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. రజనీకాంత్ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలకు చెక్ పెట్టారు రజనీ. దీనిపై ఇవాళ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు. ఎవరికీ తన మద్దతు లేదని ఒక్క ముక్కలో తేల్చేశాడు. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ అమరన్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది.



