పార్టీ పేరు.. గుర్తుపై ఆగాల్సిందే..

 

తమిళనాడు సూపర్ స్టార్ రజనీ కాంత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. రజనీ రాజకీయ ఎంట్రీతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎలాగైతే రజనీ రాజకీయాల్లోకి వచ్చారు... ఇప్పుడు ఆయన పార్టీపేరుపైన, గుర్తుపైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన పార్టీ పేరు“రజినిమంద్రం.ఓఆర్‌జీ” పెట్టే అవకాశం ఉందని... ఆయన పార్టీ గుర్తు ఆపాన ముద్ర అని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. పార్టీ పేరు, పార్టీ గుర్తుపై సంక్రాంతికి క్లారిటీ వస్తుందని కూడా అన్నారు. కానీ ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మలేషియా పర్యటన ముగించుకుని చెన్నైకి చేరుకున్న రజనీకాంత్‌.. మీడియాతో మాట్లాడుతూ... సంక్రాంతి, పొంగల్‌ సందర్భంగా పార్టీపేరు, గుర్తును వెల్లడిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఈ నెలలో అలాంటి అధికారిక ప్రకటనలు ఏవీ లేవని అన్నారు. అంతేకాదు...బాబా ముద్ర పార్టీ గుర్తుగా ఉంటుందని వస్తున్న వార్తలను కూడా కొట్టిపడేశారు. మరి రాజకీయ ప్రవేశానికే ఇన్ని రోజులు తీసుకున్నారు.. మరి పార్టీ పేరు... గుర్తు ప్రకటించడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటారో.... చూద్దాం...