TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

37 రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Published on: Wed Feb 18, 2026 1:41PM

దేశంలో  ఎన్నికల నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం (ఫిబ్రవరి 18) విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ సహా  10 రాష్ట్రాలలో  మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 16న ఎన్నికలు జరగుతాయి.  దేశ వ్యాప్తంగా  10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళా అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాలలో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.  

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు మార్చి 5. కాగా అదే నెల 6న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9  తుదిగడువు. ఇక పోలింగ్ మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ జరుగుతుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాల ప్రకటన ఉంది.   ఖాళీ అయ్యే మొత్తం 37  రాజ్యసభ స్థానాలలో   మహారాష్ట్రలో 7 స్థానాలు, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 6 ,  బిహార్ 4, అస్సాం 3, ఒడిశా  3 , ఛత్తీస్‌గఢ్  2,  తెలంగాణ్ర- 2 స్థానాలు ఉన్నాయి, అలాగే హర్యానా -1 హిమాచల్ ప్రదేశ్ నుంచి1  స్థానం ఉన్నాయి.