చెట్లు నరకొద్దన్న మహిళ.. సజీవ దహనం చేసిన గ్రామస్థులు..
Published on: Mon Mar 27, 2017 4:15PM

రాజస్థాన్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చెట్లు నరకవద్దు అన్న పాపానికి ఓ మహిళను అత్యంత దారుణంగా సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం... రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి లలిత అనే మహిళకు చెందిన పొలంలో చెట్లు అడ్డుగా వచ్చాయి. దీంతో గ్రామస్థులు వాటిని తొలగిస్తామని చెప్పారు. కానీ లలిత మాత్రం దానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆమెపై దాడి చేసి అంతటితో ఆగకుండా.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన లలితను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో గ్రామ సర్పంచ్ రణ్‌వీర్ సింగ్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


