TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎస్‌కేపై రాజస్థాన్ ‘రాయల్’ విజయం

Published on: Tue Mar 31, 2026 6:51AM

అయిదు సార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్ధాన్ రాయల్స్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 127 పరుగులకే ఆలౌట్ అయింది.  టార్గెట్ చిన్నది అవ్వడంతో ధీమాగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో  ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ ( 9 బంతుల్లో 18, 4 ఫోర్లు) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ( 36 బంతుల్లో, 38 నాటౌట్), రియాన్ పరాగ్ (11 బంతుల్లో 14 నాటౌట్)లు 12.1 ఓవర్లలోనే రాజస్థాన్‌కు ‘రాయల్’ విజయం అందించారు.

గాయం కారణంగా స్టార్ ఆటగాడు ధోని, మరో డ్యాషింగ్ బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్‌లు అందుబాటులో లేకపోవడం సీఎస్‌కేకి పెద్ద మైనస్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై జట్టులో జేమీ ఓవర్టన్ (43, 36 బంతులు) ఒక్కడే బ్యాట్‌కు పనిచెప్పగలిగాడు.  అతని తర్వాత కార్తీక్ శర్మ (18) సీఎస్‌కే టాప్ స్కోరర్ అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.