చిత్తుగా ఓడిన ముంబాయి ఇండియన్స్

Rajasthan inflict a royal defeat on IPL giants Mumbai Indians, Rajasthan Royals beat Mumbai Indians by 87 runs, IPL-6 Mighty Rajasthan Royals rout Mumbai Indians by 87 runs

 

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ X ముంబాయి ఇండియన్స్ మధ్య ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ ఐపిఎల్-6 లో అతి తక్కువ స్కోరు 18.2 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అతిరథ మహారధులు ఉన్న ముంబాయి ఇండియన్స్ 92 పరుగులకే ఆలౌట్ అవడం గత ఏడాది ఢిల్లీ డేర్ డెవిల్స్ పై చేసిన 92 పరుగుల రికార్డ్ ను సమం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ పరుగుల వరద పారించింది. ఓపెనర్లు అజింక్యా రహానే 68 నాటౌట్, వాట్సన్ 31 చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ఆరు ఓవర్లలో 58 పరుగులు రాబట్టారు. పోలార్డ్ వేసిన బంతిని ఆడబోయి వాట్సన్ కీపర్ దినేష్ కార్తీక్ కి క్యాచ్ ఇచ్చాడు. రహానే కు తోడుగా వచ్చిన యాజ్ఞిక్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో వీరిద్దరూ రెండో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. యాజ్ఞిక్ 34 హర్బజన్ సింగ్ బౌలింగ్ లో సచిన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన బిన్నీ 4 రనౌట్ గా వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన హాడ్జ్ 27 నాటౌట్, రహానే నాలౌగో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పోలార్డ్ 1, హర్బజన్ సింగ్ 1 వికెట్లు తీశారు. తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబాయి ఇండియన్స్ కు మొదటి ఓవర్లోనే సచిన్ 1 త్రివేది క్యాచ్ పట్టగా చండీలా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. రికీ పాంటింగ్ 4ను కూడా చండీలా కాట్ అండ్ బౌల్డ్ గా అవుట్ చేశాడు. 10 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ముంబాయి ఇండియన్స్ తరువాత రోహిత్ శర్మ 2 త్రివేది బౌలింగ్ లో వాట్సన్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. పోలార్డ్ 1ను బిన్నీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దినేష్ కార్తీక్ 30, అంబటి రాయుడు 27 కొద్దిసేపు పోరాడారు. దినేష్ కార్తీక్ ను ఫాల్కనర్ వేసిన బౌలింగ్ లో హాడ్జ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అబతి రాయుడు కూడా కూపర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుతిరిగాడు. ఆ తరువాత ముంబాయి ఇండియన్స్ ఏ పరిస్థితుల్లోనూ టార్గెట్ ను ఛేదించే సాహసం చేయలేకపోయింది. ధావన్ 0, హర్భజన్ సింగ్ 1 రనౌట్, మిచెల్ జాన్సన్ 11, మలింగ్ 7, ప్రజ్ఞాన్ ఓజా 1 నాటౌట్ గా నిలిచాడు. ఫాల్కనర్ 3, బిన్నీ 2, చండీలా 2, కూపర్ 1, త్రివేది 1 వికెట్లు తీయడంతో ముంబాయి ఇండియన్స్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. 2011లో పంజాబ్ చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన తరువాత ఈ సీజన్ లో 87 తేడాతో ఓడింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 68 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రహానే కు దక్కింది.