TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీకి మరో పెద్ద షాక్

Published on: Tue Jun 26, 2018 5:51PM

 

ప్రస్తుతం బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. కర్ణాటక ఎన్నికల్లో అధికారం దక్కకపోవడం, ఉపఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం, మిత్రపక్షాలు దూరమవ్వడం.. వీటికి తోడు కీలక నేతలు పార్టీని వీడటం.. మొన్నటికి మొన్న 2014 ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరుపున కీలక పాత్ర పోషించిన 'శివమ్ శంకర్ సింగ్' పార్టీని వీడి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో కీలక నేత బీజేపీని వీడారు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత ఘనశ్యామ్ తివారి బీజేపీకి రాజీనామా చేసారు.. తన రాజనామా లేఖను అమిత్ షాకు సమర్పించారు..

రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేతో ఆయనకు కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయని, ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.. రాజీనామా చేసి బయటకి వచ్చిన ఆయన, దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం నాటి పరిస్థితులు సృష్టించారంటూ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనశ్యామ్ గత ఎన్నికల్లో, రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.. గత ముప్పై ఏళ్లుగా బీజేపీలో తిరుగులేని నేతగా పేరొందిన ఘనశ్యాం తివారి పార్టీ వీడడంతో స్థానిక బీజేపీ నేతలు షాక్ అవుతున్నారు.. ఆయన బాటలోనే మరికొందరు ఎమెల్యేలు కూడా పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.