అసెంబ్లీలో ఎమ్మెల్యేల నిద్రలు...
Published on: Thu Mar 9, 2017 4:13PM
.jpg)
సాధారణంగా రాజకీయ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని సార్లు నిద్రపోవడం చూస్తూనే ఉంటాం. అలా నిద్రపోయి కెమెరాల కంట్లో చిక్కి విమర్శల పాలవడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది రాజస్థాన్ అసెంబ్లీలో. రాజస్థాన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వసుంధర రాజే శాసనసభలో బడ్జెట్ వివరాలు వివరిస్తున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు హాయిగా నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కారు. బడ్జెట్‌లో భాగంగా ఆమె వివరాలు వెల్లడిస్తున్నప్పుడు అసెంబ్లీలోని చివరి వరుసలో ఓ ఎమ్మెల్యే తాపీగా నిద్రపోతుండగా... మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కి వాలిపోయి హాయిగా నిద్రపోతూ కన్పించారు. ఇంకేముంది ఈ ఫొటోలు కాస్త మీడియాలోకి రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి ఉన్నారన్న భయం కూడా లేకుండా ఎమ్మెల్యేలు నిద్ర పోవడంపై కామెంట్లు విసురుతున్నారు.




