TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై మళ్లీ వార్తలు...

Published on: Tue Mar 21, 2017 5:55PM

 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో చాలాసార్లు రజనీ ఎంట్రీపై వార్తలు వచ్చాయి. ఇప్పుడు తమిళనాట మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లో వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ స్థానం నుంచి ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఈ వార్త బయటకు వచ్చింది. ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంగై అమరన్.. రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. రజనీతో అమరన్‌ కలవడంపై తమిళనాట సర్వత్రా చర్చ జరుగుతోంది. రజనీ త్వరలో బీజేపీలో చేరుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే బీజేపీలోకి తమిళ సూపర్ స్టార్ చేరుతారా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్ష్. మరి దీనిపై రజనీ అయితే ఇప్పటివరకూ ఏం స్పందించలేదు.