యూట్యూబ్‌లో రజనీ మేనియా
Published on: Thu Sep 12, 2013 8:29AM

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. థియేటర్‌లోనే కాదు యూట్యుబ్‌లో కూడా తానే నెంబర్ వన్ అని నిరూపించాడు. రజనీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కొచ్చాడియన్. ఇటీవల వినాయక చవితి కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
యూ ట్యూబ్ లో కొచ్చాడియన్ టీజర్ దుమ్మురేపుతోంది. పూర్తి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన తొలిని ఇండియన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈసినిమా యూట్యుబ్ హిట్స్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రజనీ డైలాగ్స్ లేకుండానే రిలీజ్ అయిన ఈ టీజర్‌ను మూడురోజుల్లోనే 16 లక్షల మంది చూశారు.
రజీనీ కూతురు సౌందర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ కూడా వర్క్ చేశారు. త్వరలో ఆడియో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాను డిసెంబర్12 న రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళ్‌తో పాటు, హిందీ, మళయాలం, జపనీస్‌లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో విక్రమసింహ పేరుతో రిలీజ్‌కు రెడీ అవుతుంది.


