రజనీ అభిమానుల అగ్రహం
Published on: Fri May 5, 2023 1:21PM
ఇటీవలి కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మెడకు చుట్టుకున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో రజనీ కాంత్ అభిమానులు అలాగే తమిళులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాలలో ఈ ప్రభావం కనిపిస్తుంది. మూడు జిల్లాల ప్రజలు వైసీపీ నేతలపై రగిలిపోతున్నారు. మూరో 9 నెలల్లో జరిగే ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెబుతాం అంటూ స్థానిక ప్రజలు, రజనీ కాంత్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులలో ఈ మూడు జిల్లాల్లో ఈ సారి గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. రజనీ కాంత్ పై వైసీపీ నాయకుల వల్ల ఖచ్చితంగా రెండు శాతం ఓట్లపై ప్రభావం పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు


